అగ్రరాజ్యాలతో పోటీ.. అత్యధిక సైనిక వ్యయం చేసే టాప్ 5 దేశాల్లో భారత్
- ప్రపంచ సైనిక వ్యయంలో 5వ స్థానానికి చేరిన భారత్
- 2025లో భారత్ రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లుగా నమోదు
- 2024తో పోలిస్తే 8.9 శాతం పెరిగిన భారత సైనిక ఖర్చు
- రెండో స్థానంలో చైనా.. 31వ స్థానంలో పాకిస్థాన్
- ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం 2.8 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరిన వైనం
ప్రపంచంలో అత్యధికంగా సైనిక వ్యయం చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025లో భారత్ రక్షణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ జాబితాలో అమెరికా, చైనా, రష్యా, జర్మనీ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ మొత్తం సైనిక వ్యయంలో భారత్ వాటా 3.2 శాతంగా నమోదైంది.
2025లో భారత్ రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే 8.9 శాతం అధికం. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వంటి పరిణామాల కారణంగా సైనిక సన్నద్ధతను పెంచుకోవడానికి భారత్ అత్యవసర ఆయుధ కొనుగోళ్లు చేపట్టింది. ఈ కారణాలతోనే రక్షణ వ్యయం పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది.
పొరుగు దేశాల సైనిక వ్యయం కూడా భారీగా పెరుగుతోందని ఈ నివేదిక హైలైట్ చేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద రక్షణ వ్యయం కలిగిన చైనా, తన బడ్జెట్‌ను 7.4 శాతం పెంచుకుని 336 బిలియన్ డాలర్లకు చేర్చింది. మరోవైపు, పాకిస్థాన్ కూడా తన సైనిక వ్యయాన్ని 11 శాతం పెంచి 11.9 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లింది. ప్రపంచ దేశాల జాబితాలో పాకిస్థాన్ 31వ స్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం 2025లో 2,887 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరినట్లు నివేదిక వెల్లడించింది. అమెరికా, చైనా, రష్యా.. ఈ మూడు దేశాల మొత్తం వ్యయమే 1,480 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ప్రపంచ మొత్తం వ్యయంలో 51 శాతానికి సమానం. ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఐరోపా దేశాలు తమ రక్షణ బడ్జెట్లను భారీగా పెంచుతున్నాయి.
భారత్ రక్షణ వ్యయం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, విదేశీ ఆయుధ దిగుమతులపై ఆధారపడటం క్రమంగా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. ఇది రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత్ వేస్తున్న బలమైన అడుగులకు నిదర్శనంగా కనిపిస్తోంది.